Rohini Acharya: వారసత్వాన్ని కొందరు నాశనం చేస్తున్నారు.. అందుకు బయటి వ్యక్తులు అవసరం లేదు: లాలూ కూతురు రోహిణి ఆచార్య

Rohini Acharya Slams Destroyers of Legacy No Outsiders Needed
  • కుటుంబ గౌరవాన్ని, ఉనికిని నిలబెట్టిన వారి మూలాలను చెరిపేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వ్యాఖ్య
  • ఇది తనను ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేసిందన్న రోహిణి ఆచార్య
  • గొప్ప వారసత్వాన్ని బయటి వ్యక్తులు నాశనం చేయాల్సిన అవసరం లేదన్న రోహిణి ఆచార్య
తమ వారసత్వాన్ని కొందరు నాశనం చేస్తున్నారని, ఇందుకు బయటి వ్యక్తులు అవసరం లేదని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య విమర్శించారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, కుటుంబ గౌరవాన్ని, ఉనికిని నిలబెట్టిన వారి మూలాలను చెరిపేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు తనను దిగ్భ్రాంతికి గురి చేశాయన్నారు.

ఎంతో శ్రమతో సృష్టించిన గొప్ప వారసత్వాన్ని నాశనం చేయడానికి బయటి వ్యక్తులు అవసరం లేదని, తమకు ప్రియమైన వారే ఆ పని చేయగలరని ఆమె వ్యాఖ్యానించారు. తమను నాశనం చేయడానికి సొంత వ్యక్తులే చాలని రోహిణి ఆచార్య అన్నారు. అజ్ఞానం అనే ముసుగు కప్పుకున్నప్పుడు అహంకారం తలకెక్కుతుందని, అప్పుడు వినాశకర శక్తులు ఒక వ్యక్తి ఆలోచనలను, నిర్ణయాలను నియంత్రిస్తాయని ఆమె పేర్కొన్నారు.

లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను కుటుంబం నుంచి బహిష్కరించడంపై రోహిణి అసంతృప్తితో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం తర్వాత ఆమె తన కుటుంబంతో సంబంధాలు తెంచుకున్నట్లు ప్రకటించారు.
Rohini Acharya
Lalu Prasad Yadav
RJD
Tej Pratap Yadav
Bihar Politics
Family Feud
Political Legacy

More Telugu News