Nara Bhuvaneswari: నారా భువనేశ్వరికి మరో విశిష్ట పురస్కారం... గర్విస్తున్నానంటూ సీఎం చంద్రబాబు స్పందన

Nara Bhuvaneswari Receives Prestigious Award CM Chandrababu Responds
  • నారా భువనేశ్వరికి  'అవుట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్' అవార్డు
  • మహిళా సాధికారతకు చేస్తున్న సేవలకు ప్రశంసలు
  • భువనేశ్వరి కృషి స్ఫూర్తిదాయకమన్న సీఎం చంద్రబాబు
  • ఈ గౌరవం పాడి రైతులకే చెందుతుందన్న భువనేశ్వరి
ముఖ్యమంత్రి చంద్రబాబు తన అర్ధాంగి, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా భువనేశ్వరిపై ప్రశంసలు కురిపించారు. ఆమెకు మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పాడి రైతుల అభ్యున్నతి, మహిళా సాధికారత కోసం భువనేశ్వరి చేస్తున్న కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ పురస్కారం ఆమెకు, ఆమె బృందానికి దక్కాల్సిన సరైన గుర్తింపు అని పేర్కొన్నారు. ఈ గౌరవం వెనుక ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది పాడి రైతుల కృషి ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇండియన్ డెయిరీ అసోసియేషన్ (సౌత్ జోన్) నారా భువనేశ్వరికి 'అవుట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్' అవార్డును ప్రకటించింది. డెయిరీ రంగంలో ఆమె అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు.

ఈ అవార్డు అందుకోవడంపై భువనేశ్వరి స్పందించారు. తనకు ఈ గౌరవాన్ని అందించిన ఇండియన్ డెయిరీ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది పాడి రైతులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. భారత డెయిరీ రంగం అభివృద్ధి, శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తానని ఆమె మరోసారి స్పష్టం చేశారు.
Nara Bhuvaneswari
Chandrababu Naidu
Heritage Foods
Indian Dairy Association
Dairy Industry
Andhra Pradesh
Women Empowerment
Dairy Farmers
Outstanding Dairy Professional Award

More Telugu News