Chartered Plane: ఒడిశాలో కూలిపోయిన చార్టర్డ్ విమానం

Chartered Plane Crashes in Odisha
  • రూర్కేలా నుండి భువనేశ్వర్‌కు వెళుతున్న చార్టర్డ్ విమానం
  • పైలట్ సహా ఏడుగురు ప్రయాణికులు ఉండగా కూలిన చార్టర్డ్
  • క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు
ఒడిశాలో చార్టర్డ్ విమానం కూలిపోయింది. రూర్కేలా నుంచి భువనేశ్వర్‌కు ప్రయాణిస్తున్న తొమ్మిది సీట్ల విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటన జరిగిన సమయంలో విమానంలో పైలట్‌తో సహా మొత్తం ఏడుగురు వ్యక్తులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులకూ గాయాలు కాగా, వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సుందర్‌గఢ్ జిల్లాలోని కన్సార్ ప్రాంతంలో ఈ చార్టర్డ్ విమానం కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా నిర్ధారణ కాలేదు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 
Chartered Plane
Odisha
Rourkela
Bhubaneswar
Plane Crash
Sundargarh
Aviation Accident

More Telugu News