Joy Mahapatra: అప్పు చెల్లించలేదని కొట్టి, అవమానించారు... బంగ్లాదేశ్ లో హిందూ యువకుడి బలవన్మరణం

Bangladesh Hindu Youth Joy Mahapatra Dies by Suicide Over Debt
  • బంగ్లాదేశ్‌లో 500 టాకాల అప్పు చెల్లించలేదని హిందూ యువకుడిపై దాడి
  • అవమానంపై ఆత్మహత్య
  • విషం తాగి, చికిత్స పొందుతూ 19 ఏళ్ల యువకుడి మృతి
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై హింసాత్మక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, కేవలం 500 టాకాల (బంగ్లాదేశ్ కరెన్సీ) అప్పు చెల్లించలేదంటూ తన చేసిన అవమానాన్ని భరించలేక 19 ఏళ్ల హిందూ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సునమ్‌గంజ్ జిల్లాలోని దిరాయ్ ఉపజిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతుడిని జాయ్ మహపాత్రగా గుర్తించారు. విషం తాగిన అతడు, సిల్హెట్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించాడు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, జాయ్ ఓ కిరాణా దుకాణం యజమాని అమీరుల్ ఇస్లాం వద్ద 5,500 టాకాలకు ఒక మొబైల్ ఫోన్ కొనుగోలు చేశాడు. ముందుగా 2,000 టాకాలు చెల్లించి, మిగిలిన మొత్తాన్ని వారానికి 500 టాకాల చొప్పున వాయిదాల్లో చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. అయితే, చివరి వాయిదా చెల్లింపులో జాప్యం జరిగింది. గురువారం డబ్బు చెల్లించడానికి దుకాణానికి వెళ్లిన జాయ్‌ను అమీరుల్ ఇస్లాం కొట్టి, అవమానించి అతని ఫోన్‌ను లాక్కున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఈ అవమానంతో తీవ్ర మనస్తాపానికి గురైన జాయ్, అదే రోజు సాయంత్రం విషం తాగాడు. వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో సిల్హెట్‌కు రిఫర్ చేశారు. "నా కొడుకును డబ్బుల కోసం అవమానించి, ఫోన్ లాక్కున్నారు. ఆ బాధతోనే నా కొడుకు దుకాణంలోనే విషం తాగాడు" అని జాయ్ తల్లి షెల్లీ మహపాత్ర కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందిందని, ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దిరాయ్ పోలీసులు తెలిపారు.

Joy Mahapatra
Bangladesh
Hindu youth
suicide
minority violence
Sunamganj
Dirai
loan
Amirul Islam

More Telugu News