Durga Temple: దుర్గమ్మ గుడిలో భక్తులకు కరెంట్ షాక్.. విద్యుత్ నిలిపేసిన అధికారులు

Electric Shock to Devotees at Durga Temple Officials Suspend Power
  • ప్రసాద వితరణ కేంద్రం దగ్గర షాక్ తగిలిందన్న భక్తులు
  • వెంటనే స్పందించి మెయిన్ స్విచ్ ఆఫ్ చేసిన సిబ్బంది
  • భక్తులు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఆలయ సిబ్బంది వివరణ
దుర్గమ్మ గుడిలో శనివారం నాడు పెను ప్రమాదం తప్పింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఉదయం విద్యుత్ షాక్ తగిలింది. ఆలయంలోని ప్రసాద వితరణ కేంద్రం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తగిలిన భక్తులు భయాందోళనలతో కేకలు వేయగా కొద్దిసేపు గందరగోళం నెలకొంది. భక్తుల కేకలు విన్న ఆలయ సిబ్బంది వెంటనే స్పందించి మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

ఆలయ ఎలక్ట్రీషియన్, అధికారులు ప్రసాద వితరణ కేంద్రం వద్ద ఉన్న విద్యుత్ తీగలను పరిశీలించారు. సంక్రాంతి సెలవులు కావడంతో శనివారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు విద్యుత్ షాక్ తగలడం కలకలం రేపింది. అయితే, విద్యుత్ షాక్ కారణంగా భక్తులు ఎవరూ గాయపడలేదని, మరమ్మతులు పూర్తి చేసిన తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.
Durga Temple
Durga Temple Vijayawada
Vijayawada
Andhra Pradesh
Electric Shock
Temple Accident
Prasadam Distribution
Sankranti Festival
Temple Safety

More Telugu News