All India Pregnant Job: ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్.. బీహార్ లో కొత్త మోసం

All India Pregnant Job scam in Bihar promises money for pregnancy
  • పిల్లల్లేని మహిళను ప్రెగ్నెంట్ చేస్తే రూ.10 లక్షలు ఇస్తామని ఆఫర్
  • ఆ ప్రయత్నంలో ఫెయిలైతే అందులో సగం వరకూ పొందవచ్చని గాలం
  • రిజిస్ట్రేషన్, హోటల్ ఫీజుల పేరుతో బాధితుల నుంచి వసూళ్లు
  • ఓ మైనర్ సహా ఇద్దరిని అరెస్టు చేసిన బీహార్ పోలీసులు
పిల్లలు కలగని మహిళలను తల్లిని చేస్తే రూ.10 లక్షలు ఇస్తామంటూ ఆన్ లైన్ లో ప్రకటన.. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ పేరుతో కనిపించే ఈ ప్రకటన చూసి బీహార్ లో చాలామంది మోసపోయారు. ఆ ప్రకటనలోని ఫోన్ నెంబర్ కు కాల్ చేసిన వారికి మాయమాటలు చెప్పి భారీ మొత్తంలో దండుకున్నారు ఇద్దరు మోసగాళ్లు. ఇందులో ఒకరు మైనర్ కావడం గమనార్హం. మోసపోయామని తెలిసినా పరువుపోతుందని కొంతమంది మౌనాన్ని ఆశ్రయించగా.. మరికొందరు మాత్రం పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు.

మహిళలను ప్రెగ్నెంట్ చేయాలంటూ గాలం..
పిల్లలు కలగక బాధపడుతున్న మహిళలను తల్లులు చేయాలంటూ ఆకర్షణీయమైన మోడళ్ల ఫొటోలతో నిందితులు ఆన్ లైన్ లో ప్రకటనలు గుప్పించారు. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ పేరుతో తాము దేశవ్యాప్తంగా సేవలందిస్తున్నామని, ఏ రాష్ట్రానికి చెందిన వారికైనా తాము ‘జాబ్’ ఇస్తామని చెప్పారు. ఈ ప్రకటన చూసి ఫోన్ చేసిన వారిని తాము చెప్పిన మహిళను ప్రెగ్నెంట్ చేస్తే రూ.10 లక్షలు ఇస్తామని, ఒకవేళ ఆ ప్రయత్నంలో విఫలమైతే అందులో సగం ఇస్తామని ప్రలోభపెట్టారు.

అయితే, ఇందుకోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, దీనికి కొంత రుసుము చెల్లించాలని చెప్పారు. పని పూర్తయితే పది లక్షలు సొంతమవుతాయని కొందరు.. లక్షల మాటెలా ఉన్నా సుఖం దక్కుతుందని మరికొందరు ఈ మోసగాళ్ల వలకు చిక్కారు. నిందితులు చెప్పినట్లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించగా.. తర్వాత హోటల్ టారిఫ్ అంటూ మరికొంత చెల్లించాలని అడిగేవారు. ఇలా ఓ ఫీజు చెల్లించాక మరో పేరుతో ఫీజు వసూలు చేసేవారు. మోసపోయామని బాధితులు గుర్తించేదాకా ఈ తంతు ఇలాగే కొనసాగేది.
All India Pregnant Job
Bihar Crime
Online Fraud
Pregnancy Scam
Job Scam
Cyber Crime
Indian Scams
Bihar Police

More Telugu News