Mallu Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

Telangana Government Announces Good News for Government Employees
  • ఉద్యోగులకు రూ.1.02 కోట్ల ప్రమాద బీమా అందించనున్నట్లు వెల్లడి
  • ప్రభుత్వం నిర్ణయంతో 5.14 లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం
  • సింగరేణి, విద్యుత్ సంస్థల్లో ఇప్పటికే రూ.1 కోటికి పైగా బీమా
తెలంగాణ సర్కారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుకను ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అందించనున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని 5.14 లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.

ఇదివరకే సింగరేణి, ట్రాన్స్‌కో, జెన్‌కో ఉద్యోగులకు రూ.1 కోటికి పైగా బీమా అందుతోంది. సింగరేణిలో 38 వేల మంది, విద్యుత్ సంస్థల్లో 71 వేల మందికి పైగా ఉద్యోగులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అదే తరహాలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రమాద బీమాను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రమాద బీమా అమలు కోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రముఖ బ్యాంకర్లతో చర్చలు జరిపారు. ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేర్చే ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులేనని ఆయన పేర్కొన్నారు.
Mallu Bhatti Vikramarka
Telangana government
Government employees
Accidental insurance

More Telugu News