మహిళా సాధికారతకు కేంద్రంగా సోమనాథ్ ఆలయం... వివిధ సేవల్లో 363 మంది మహిళలు

  • ఆలయ నిర్వహణ, పారిశుద్ధ్యం, ప్రసాద పంపిణీ, భోజనం సహా వివిధ సేవల్లో మహిళలకు ప్రాధాన్యత
  • పూర్తిగా మహిళల నిర్వహణలో ఆలయ ప్రాంగణంలోని బిల్వ అడవి
  • భోజనశాల వద్ద 30, ప్రసాద పంపిణీ కేంద్రం వద్ద 65 మంది మహిళలు
భారతదేశ సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రమైన సోమనాథ్ ఆలయం ప్రపంచవ్యాప్తంగా భక్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. అయితే, ఈ ఆలయం కేవలం పూజ, దర్శనానికే పరిమితం కాకుండా, నేడు మహిళా సాధికారతకు శక్తివంతమైన కేంద్రంగా అవతరించింది.

ఆలయ పరిపాలన నిర్వహణకు నోడల్ బాడీ అయిన సోమనాథ్ ట్రస్ట్, వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. వీరిలో 350 మందికి పైగా మహిళలు ఈ ఆలయంలో బహుళ సేవలలో నిమగ్నమై ఉన్నారు. ఆలయ నిర్వహణ, పారిశుద్ధ్యం, ప్రసాద పంపిణీ, భోజన సేవ వంటి వివిధ విభాగాల్లో వందలాది మంది మహిళలు పని చేస్తున్నారు.

ప్రస్తుతం, సోమనాథ్ ఆలయ ట్రస్ట్‌లో మొత్తం 906 మంది ఉద్యోగులు సేవలను అందిస్తున్నారు. వీరిలో 262 మంది మహిళలు ఉన్నారు. ఇక ఆలయ ప్రాంగణంలోని బిల్వ అడవిని పూర్తిగా మహిళలు నిర్వహిస్తున్నారు. అక్కడ పనిచేస్తున్న 16 మంది మహిళలు పర్యావరణ పరిరక్షణ, హరిత కార్యక్రమాలు, పరిశుభ్రతపై దృష్టి సారించడం ద్వారా ఆలయ పవిత్రతను కాపాడుతున్నారు. ఈ ఏర్పాటు సమర్థవంతమైన నిర్వహణకు ఉదాహరణగా నిలుస్తోంది.

ఆలయ భోజనశాలలో సుమారు 30 మంది మహిళలు సేవలందిస్తున్నారు. ప్రసాదం పంపిణీ కేంద్రం వద్ద 65 మంది మహిళలు ఉన్నారు. మొత్తం మీద, సోమనాథ్ ఆలయ ట్రస్ట్ ద్వారా 363 మంది మహిళలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఈ మహిళలు స్థిరమైన ఆదాయాన్ని పొందడం ద్వారా వారి ఆర్థిక స్వాతంత్ర్యానికి మద్దతు లభిస్తోంది. తద్వారా వారి జీవన ప్రమాణాలు మరుగుపడుతున్నాయి. ఆలయ సేవలో మహిళలను భాగస్వాములను చేస్తున్న ఈ చర్య సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.


More Telugu News