కోల్‌కతాలోని ఐప్యాక్ కార్యాలయంలో సోదాలు... మమతా బెనర్జీ ఆధ్వర్యంలో మెగా ర్యాలీ

  • ఐ-ప్యాక్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు
  • సోదాలను నిరసిస్తూ మమతా బెనర్జీ ఆధ్వర్యంలో మెగా ర్యాలీ
  • ర్యాలీలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు
కోల్‌కతాలోని ఐ-ప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్‌ నివాసంతో సహా ఆ సంస్థ కార్యాలయాలపై ఈడీ దాడులను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భారీస్థాయిలో ఆందోళన చేపట్టారు. మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా ర్యాలీలో రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈడీ దాడులను నిరసిస్తూ అంతకుముందు, ఎంపీలు అమిత్ షా కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన విషయం విదితమే.

కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ ప్రాంతంలో ఉన్న ఐ-ప్యాక్ కార్యాలయంలో, ఢిల్లీలోని నాలుగు చోట్ల నిన్న ఉదయం ఏడు గంటల నుంచే ఏకకాలంలో ఈడీ సోదాలు చేపట్టింది. కొన్ని హవాలా లావాదేవీలు, నగదు వ్యవహారాలకు సంబంధించిన ఆధారాలు ప్రతీక్ జైన్ ద్వారా ఉన్నాయని ఈడీ చెబుతోంది. బొగ్గు స్మగ్లింగ్ రాకెట్‌తో సంబంధం ఉన్న ఒక హవాలా ఆపరేటర్ ద్వారా ఐ-ప్యాక్‌కు చెందిన ఇండియన్ పీఏసీ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరిగినట్లు ఈడీ వర్గాలు చెబుతున్నాయి.


More Telugu News