విజయ్ సినిమాకు భారీ షాక్... తీవ్ర నిరాశలో అభిమానులు

  • విజయ్ తాజా చిత్రం 'జన నాయగన్' కు లభించని సెన్సార్ క్లియరెన్స్ 
  • సెన్సార్ సర్టిఫికెట్ జారీపై మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ తాత్కాలిక స్టే
  • తదుపరి విచారణ ఈ నెల 21వ తేదీకి వాయిదా
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తాజా చిత్రం 'జన నాయగన్'కు మరో షాక్ తగిలింది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ సెన్సార్ బోర్డును మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్ర దర్శకనిర్మాతలు, విజయ్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. 

అయితే, సింగిల్ బెంచ్ ఆదేశాలను హైకోర్టు డివిజన్ బెంచ్ లో సెన్సార్ బోర్డు సవాల్ చేసింది. పిటిషన్ ను విచారించిన ధర్మాసనం సర్టిఫికెట్ జారీపై తాత్కాలికంగా స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. దీంతో, విజయ్ అభిమానులు షాక్ కు గురయ్యారు. 

హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయం కారణంగా... జననాయగన్ జనవరి 21 వరకు విడుదలయ్యే అవకాశాలు లేవు. 


More Telugu News