Prabhas: థియేటర్లలో ‘మొసళ్ల’ సందడి.. ‘ది రాజాసాబ్’ క్రేజ్‌తో ఫ్యాన్స్ హంగామా.. వీడియో ఇదిగో!

Prabhas The Raja Saab Movie Release Creates Fan Frenzy with Crocodile Props
  • ‘ది రాజాసాబ్’ విడుదల సందర్భంగా థియేటర్లలో మొసలి బొమ్మలతో అభిమానుల రచ్చ
  • క్లైమాక్స్‌లో ప్రభాస్-మొసలి ఫైట్ సీన్‌ను థియేటర్ల వద్దే రీక్రియేట్ చేస్తున్న ఫ్యాన్స్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై నెటిజన్ల ఫన్నీ కామెంట్స్
  • మొసలి వీడియోలు కొందరు ఏఐతో సృష్టించినవేనని సోషల్ మీడియాలో చర్చ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. థియేటర్ల వద్ద అభిమానుల సందడి మామూలుగా లేదు. అయితే, ఈసారి ఫ్యాన్స్ హంగామా కొంచెం కొత్తగా ఉంది. సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో 'మొసలి' మీమ్స్ విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే మొసలి బొమ్మలను ఫ్యాన్స్ థియేటర్లలోకి తీసుకెళ్లి వినూత్నంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

సినిమా క్లైమాక్స్‌లో ప్రభాస్ మొసలితో పోరాడే సన్నివేశం థియేటర్లలో వచ్చే సమయంలో ఫ్యాన్స్ తమ వెంట తెచ్చుకున్న మొసలి బొమ్మలను పట్టుకుని స్క్రీన్ వద్దకు వెళ్లి నానా హంగామా చేస్తున్నారు. ప్రభాస్ ఫైట్ చేస్తున్నట్టుగానే ఆ బొమ్మలతో ఫ్యాన్స్ కూడా ఫైట్ చేస్తూ ఆ సన్నివేశాన్ని రీక్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.

ఏఐ వీడియోలా?
అయితే, సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ వీడియోల్లో కొన్ని నిజమైనవేనా? లేక ఏఐతో సృష్టించినవా? అన్న చర్చ కూడా నడుస్తోంది. కొందరు నెటిజన్లు ఇవన్నీ ఏఐతో చేసిన వీడియోలని కామెంట్స్ పెడుతున్నారు. అయినప్పటికీ, ‘ది రాజాసాబ్’ ప్రమోషన్లలో ఈ మొసలి కాన్సెప్ట్ బాగా క్లిక్ అయ్యింది. ‘ఎవర్రా మీరంతా..’, ‘మొసళ్ల పండగ మొదలైంది’ అంటూ నెటిజన్లు ఈ వీడియోలపై జోకులు పేలుస్తున్నారు.
Prabhas
The Raja Saab
The Raja Saab movie
Prabhas movie
Crocodile
Crocodile memes
Fans celebration
Movie release
AI videos
Movie promotion

More Telugu News