Chandrababu Naidu: టేస్ట్ చాలా బాగుంది... హల్వా రుచి చూసిన చంద్రబాబు
- గుంటూరు శివార్లలో సరస్ - డ్వాక్రా బజార్ ను సందర్శించిన చంద్రబాబు
- ఒక స్టాల్లో మాడుగుల హల్వాను రుచి చూసిన సీఎం
- ఇతర స్టాళ్లలోని ఉత్పత్తులను పరిశీలించిన వైనం
గుంటూరు నగర శివార్లలో నిర్వహిస్తున్న 'సరస్ ఎగ్జిబిషన్ - అఖిల భారత డ్వాక్రా బజార్' ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఈరోజు అక్కడకు వెళ్లిన ముఖ్యమంత్రి ప్రదర్శనలో భాగంగా డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఒక స్టాల్లో ఏర్పాటు చేసిన మాడుగుల హల్వాను చంద్రబాబు రుచి చూశారు. టేస్ట్ చాలా బాగుందని ప్రశంసించారు. దీంతో, ఆ స్టాల్ ను ఏర్పాటు చేసిన మహిళలు ఉప్పొంగిపోయారు. అనంతరం ఇతర స్టాళ్లలోని ఉత్పత్తులను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మాధవి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తదితరులు ఉన్నారు.