Prabhas: ప్రభాస్ చేతిలో ఉన్నది గ్లాసు కాదు... లీటర్ బాటిల్!: సందీప్ రెడ్డి వంగా

Prabhas Spirit Movie Sandeep Reddy Vanga Reveals Interesting Fact
  • 'రాజాసాబ్' ప్రమోషన్‌లో 'స్పిరిట్' పోస్టర్ రహస్యం చెప్పిన సందీప్ వంగా
  • ప్రభాస్ చేతిలో ఉన్నది గ్లాస్ కాదని, లీటర్ బాటిల్ అని వెల్లడి
  • మార్పు కోసమే 15 ఏళ్ల తర్వాత 'రాజాసాబ్' లాంటి సినిమా చేశానన్న ప్రభాస్
ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌పై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఓ ఆసక్తికర రహస్యాన్ని బయటపెట్టారు. అందులో ప్రభాస్ చేతిలో ఉన్నది గ్లాస్ కాదని, అది ఒక లీటర్ బాటిల్ అని, కానీ చూడ్డానికి గ్లాస్‌లా కనిపిస్తుందని తెలిపారు. ప్రభాస్ కొత్త చిత్రం 'ది రాజాసాబ్' ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన 'కింగ్ సైజ్ ఇంటర్వ్యూ'లో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. పోస్టర్‌లో తెలుపు రంగును ఎక్కువగా హైలైట్ చేయడం వల్ల, మధ్యలో ఉన్న లిక్కర్ బాటిల్ అందరి దృష్టినీ ఆకర్షించిందని వివరించారు.

ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్‌ను సందీప్ వంగా ఓ ప్రశ్న అడిగారు. యాక్షన్ సినిమాలకే అలవాటు పడిన మీరు 'ది రాజాసాబ్' లాంటి సినిమా ఎందుకు చేశారని ప్రశ్నించారు. దానికి ప్రభాస్ సమాధానమిస్తూ, "ఒకే రకం సినిమాలు చేస్తే బోర్ కొడుతుంది. అందుకే 15 ఏళ్ల క్రితం మార్పు కోసం 'డార్లింగ్' చేశాను. ఇప్పుడు భారతీయ ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమా చేస్తున్నా" అని తెలిపారు.

'ది రాజాసాబ్' కథ గురించి ప్రభాస్ వివరిస్తూ, "ఇది అమ్మమ్మ-మనవడి కథ. అందులో అమ్మమ్మ భర్తే విలన్. కొన్ని పరిస్థితుల వల్ల వారు శిథిలమైన రాజమహల్‌కు వెళ్లాల్సి వస్తుంది. ఆ కారణం తెలియాలంటే సినిమా చూడాలి" అని అన్నారు. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ ఫాంటసీ హారర్ చిత్రంలో మాళవిక మోహనన్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా, సంజయ్ దత్ విలన్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ ఫొటోతో తేడా గమనించవచ్చు...!
Prabhas
Spirit movie
Sandeep Reddy Vanga
The Raja Saab
Maruthi
People Media Factory
Malavika Mohanan
Sanjay Dutt
Telugu movies

More Telugu News