MSVG: అనిల్ రావిపూడితో కలిసి వెంకటేశ్‌ స్టెప్పులు.. చిరు కూడా ఫిదా.. ఇదిగో వీడియో!

Venkatesh Dance at Mana Sankara Vara Prasad Garu Pre Release Event Viral Video
  • 'మన శంకర వర ప్రసాద్ గారు' ప్రీ రిలీజ్ వేడుకలో వెంకటేశ్‌ సందడి
  • దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి స్టేజ్‌పై డ్యాన్స్ చేసిన వెంకీ
  • వెంకటేశ్‌ స్టెప్పులు చూసి హుషారుగా హుక్ స్టెప్ వేసిన చిరంజీవి
  • సంక్రాంతికి రానున్న సినిమాపై మరింత పెరిగిన అంచనాలు
చిరంజీవి హీరోగా, విక్టరీ వెంకటేశ్‌ అతిథి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో వెంకటేశ్‌ తనదైన ఎనర్జీ, గ్రేస్‌తో అభిమానులను ఉర్రూతలూగించారు. దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి ఆయన వేసిన స్టెప్పుల తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట‌ వైర‌ల్ అవుతోంది.

ఈవెంట్ మధ్యలో దర్శకుడు అనిల్ రావిపూడి సరదాగా డ్యాన్స్ చేయడం ప్రారంభించగా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంకీ మామ‌ కూడా ఆయనతో జత కలిశారు. తన మార్క్ హావభావాలతో, స్టైల్‌తో వెంకీ వేసిన స్టెప్పులకు అభిమానులు, ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఫ్యామిలీ హీరోగా పేరొందిన వెంకీ నుంచి ఇలాంటి ఎనర్జిటిక్ డ్యాన్స్ చూడటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. వెంకటేశ్‌ డ్యాన్స్ చూసి ఫిదా అయిన చిరు కూడా తన సీట్లో నుంచే హుషారుగా హుక్ స్టెప్ వేయడం అందరినీ ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా వెంకటేశ్‌ మాట్లాడుతూ.. “అనిల్ రావిపూడితో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా ప్రతి ఇంట్లోని ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది. చాలా రోజుల తర్వాత ఒక పూర్తిస్థాయి కుటుంబ వినోదాత్మక చిత్రంతో మీ ముందుకు వస్తున్నాం” అని తెలిపారు. ఈ సినిమాలో తన పాత్ర ఎంతో ప్రత్యేకమని, ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ ప్రీ రిలీజ్ వేడుకలో వెంకటేశ్‌ డ్యాన్స్, చిత్రబృందం సందడితో సినిమాపై హైప్ మరింత పెరిగింది.


MSVG
Venkatesh
Chiranjeevi
Anil Ravipudi
Mana Sankara Vara Prasad Garu
pre release event
dance performance
Tollywood
family entertainer
Telugu cinema
viral video

More Telugu News