Donald Trump: రష్యా, చైనాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ట్రంప్

Donald Trump Comments on Russia and China
  • అమెరికా లేకుంటే నాటోకు ఎవరూ భయపడరన్న ట్రంప్ 
  • రష్యా, చైనా గౌరవించే, భయపడే ఏకైక దేశం అమెరికానేనని వ్యాఖ్య
  • తాను జోక్యం చేసుకోకపోతే రష్యా ఇప్పటికే ఉక్రెయిన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకునేదన్న ట్రంప్
  • ఎనిమిది యుద్ధాలను ఆపినా నోబెల్ బహుమతి విషయంలో నార్వే మూర్ఖంగా వ్యవహరించిందని ఆరోపణ
అమెరికా లేకపోతే నాటోను ఎవరూ ఖాతరు చేయరని, రష్యా, చైనా గౌరవించే, భయపడే ఏకైక దేశం అమెరికా మాత్రమేనని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికా సొంతం చేసుకుంటే నాటో కూటమి చీలిపోయినట్టేనని డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, పోలాండ్ తదితర నాటో దేశాలు హెచ్చరించిన నేపథ్యంలో ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

తన సొంత సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' ద్వారా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైనిక సామర్థ్యాన్ని తాను పునర్నిర్మించి బలోపేతం చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. నాటో దేశాలన్నీ తమ మిత్రులేనని, తాను జోక్యం చేసుకోకపోతే రష్యా ఇప్పటికే ఉక్రెయిన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకునేదని అన్నారు. తాను ఒంటిచేత్తో ఎనిమిది యుద్ధాలను ఆపానని మళ్లీ చెప్పుకొచ్చారు. అయినప్పటికీ నోబెల్ బహుమతి విషయంలో నార్వే మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

అమెరికా లేకుంటే నాటోను రష్యా, చైనా ఏమాత్రం ఖాతరు చేయవని ఆయన అన్నారు. అమెరికాకు అవసరమైనప్పుడు నాటో మద్దతుగా ఉంటుందో లేదో తనకు అనుమానంగానే ఉందని వ్యాఖ్యానించారు. నాటో అండగా లేకపోయినా అమెరికా మాత్రం వారికి అండగా ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. 
Donald Trump
Russia
China
NATO
Ukraine
USA
Greenland
Truth Social
US Military

More Telugu News