చిరు, ప్రభాస్ సినిమాల నిర్మాతలకు హైకోర్టులో ఊర‌ట.. టికెట్ రేట్లపై కీలక ఆదేశాలు

  • సంక్రాంతి సినిమాల నిర్మాతలకు హైకోర్టులో ఊరట
  • టికెట్ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశం
  • 'రాజాసాబ్', 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రాలకు మేలు
  • సింగిల్ బెంచ్ తీర్పు ఈ చిత్రాలకు వర్తించదని స్పష్టం చేసిన కోర్టు
సంక్రాంతి బరిలో నిలిచిన 'ది రాజాసాబ్', 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రాల నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. టికెట్ రేట్ల పెంపుదలపై నిర్మాతలు చేసుకున్న వినతిని పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శిని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది.

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో 'ది రాజాసాబ్' జనవరి 9న, చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకరవరప్రసాద్ గారు' జనవరి 12న విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో టికెట్ రేట్ల పెంపు, ప్రత్యేక షోల కోసం నిర్మాతలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని, హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్, టికెట్ రేట్ల పెంపును నిరాకరిస్తూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు 'పుష్ప-2', 'ఓజీ', 'అఖండ‌2', 'గేమ్ ఛేంజ‌ర్‌' వంటి చిత్రాలకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ రెండు సంక్రాంతి చిత్రాలకు ఆ తీర్పు వర్తించదని తేల్చిచెప్పడంతో నిర్మాతలకు ఊర‌ట ల‌భించిన‌ట్లైంది.


More Telugu News