Nara Lokesh: సాక్షిపై పరువునష్టం దావా.. విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి లోకేశ్‌

Nara Lokesh Attends Visakhapatnam Court in Defamation Case Against Sakshi
  • విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టులో మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్
  • 2019లో ప్రచురితమైన కథనంపై ఈ కేసు వేసిన లోకేశ్‌ 
  • 'చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి' అనే శీర్షికపై దావా
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యారు. సాక్షి దినపత్రిక తనపై ప్రచురించిన ఓ అసత్య కథనంపై ఆయన గతంలో పరువునష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో జరుగుతున్న క్రాస్ ఎగ్జామినేషన్ కోసం ఆయన ఈరోజు తన న్యాయవాదులతో కలిసి హాజరయ్యారు.

2019 అక్టోబర్ 22న సాక్షి పత్రికలో ‘చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఇది పూర్తిగా అవాస్తవమని ఆరోపిస్తూ లోకేశ్‌ ఈ కేసు దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో రెండుసార్లు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి కాగా, నేడు మూడోసారి ఆయన కోర్టు విచారణకు హాజరయ్యారు.
Nara Lokesh
Sakshi
Defamation case
Visakhapatnam court
AP Minister
Cross examination
Chinna Babu Chirutindi
25 lakhs
Libel case
Andhra Pradesh politics

More Telugu News