Viral Video: వడపావ్ ఆఫర్ చేసిన అభిమాని.. రోహిత్ శర్మ రిప్లై ఇదే..!

Fan Offers Vada Pav To Rohit Sharma Once Again His Reply Goes Viral
  • న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు ముందు ప్రాక్టీస్‌లో ఘటన
  • ఫిట్‌నెస్‌పై పూర్తిస్థాయిలో దృష్టి సారించిన భారత మాజీ కెప్టెన్
  • గతేడాది వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు సృష్టించిన హిట్‌మ్యాన్
  • టెస్టులు, టీ20ల నుంచి రిటైరైన తర్వాత ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ
టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో తెలిపే ఓ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో ఉండగా, ఓ అభిమాని అతడికి వడపావ్ తినమని మరాఠీలో ఆఫర్ చేశాడు. "రోహిత్ భయ్యా, వడపావ్ పాహిజే కా?" (రోహిత్ భాయ్, వడపావ్ కావాలా?) అని అడిగాడు. దీనికి రోహిత్ నవ్వుతూ సున్నితంగా వద్దని చేతితో సైగ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట‌ వైరల్ అవుతోంది.

టెస్టులు, టీ20 ఫార్మాట్‌ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రోహిత్ తన పూర్తి దృష్టిని ఫిట్‌నెస్‌పై కేంద్రీకరించాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్‌ శారీరకంగా చాలా మార్పులకు లోనయ్యాడు. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఆడుతున్న రోహిత్, ఆదివారం నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం తీవ్రంగా సాధన చేస్తున్నాడు. తన ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫొటోను కూడా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.

గత సంవత్సరం రోహిత్ శర్మ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఆయన సారథ్యంలో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోగా, ఫైనల్‌లో 76 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెరీర్‌లో తొలిసారి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అంతేకాకుండా వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా షాహిద్ అఫ్రిది రికార్డును (351) అధిగమించాడు. ప్రస్తుతం 279 వన్డేల్లో 355 సిక్సర్లతో రోహిత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత ఆటగాడిగా కూడా ఘనత సాధించాడు.
Viral Video
Rohit Sharma
Rohit Sharma fitness
India cricket
cricket
vadapav
Vijay Hazare Trophy
Mumbai cricket
ICC Champions Trophy
Shahid Afridi
cricket records

More Telugu News