Jaggareddy: టిక్కెట్ల కోసం నా వద్దకు ఎవరూ రావొద్దు: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Jaggareddy No one should come to me for tickets
  • సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చిన జగ్గారెడ్డి
  • మున్సిపల్ ఎన్నికల ప్రచారాని తనను పిలవొద్దన్న జగ్గారెడ్డి
  • అధికారంలో ఉన్నామని పోలీసులను అడ్డుపెట్టుకుని గెలవాలని చూడవద్దని సూచన
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం తన వద్దకు ఎవరూ రావొద్దని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు. సంగారెడ్డిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తనను మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి పిలవొద్దని స్పష్టం చేశారు.

భవిష్యత్తులో ఎమ్మెల్యే కానున్న నిర్మలా జగ్గారెడ్డిని ఈ ఎన్నికల ప్రచారానికి పిలవాలని సూచించారు. జగ్గారెడ్డిని సంగారెడ్డి పట్టణ ప్రజలు విశ్వసిస్తారని ఆయన అన్నారు. ఆమె గెలుపు కోసం చేసే వాగ్ధానాలన్నీ తానే నెరవేరుస్తానని భరోసా ఇచ్చారు. తన జీవితంలో తాను పోలీసులను ఎదిరించి రాజకీయం చేశానని గుర్తు చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని తాను ఎప్పుడూ రాజకీయం చేయలేదని అన్నారు.

అధికారంలో ఉన్నామని పోలీసులను అడ్డుపెట్టుకుని గెలవాలని చూడవద్దని అన్నారు. ఈ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం గాంధీ భవన్‌కు వెళ్లి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను కలిసి ఇబ్బంది పెట్టవద్దని అన్నారు. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఇచ్చే హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి వాటిని నెరవేర్చే బాధ్యత తనదేనని అన్నారు. ఎన్నికల్లో పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను ఓడించాలని చూస్తే వారిపై వేటు ఖాయమని హెచ్చరించారు.
Jaggareddy
Sangareddy
Sadasivpet
Telangana Congress
Municipal Elections
Nirmala Jagga Reddy
Revanth Reddy

More Telugu News