జనవరి 11న 'మన శంకర వరప్రసాద్ గారు' ప్రీమియర్స్... ఓవర్సీస్ లో ప్రభంజనం

  • యూకేలో సత్తా చాటుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'
  • 10,000కు పైగా టికెట్ల విక్రయం
  • చిరంజీవి, వెంకటేశ్ కాంబోపై భారీ అంచనాలు
  • సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల
  • అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న చిత్రం
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' (MSG) చిత్రం విడుదల కాకముందే ఓవర్సీస్‌లో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా యూకేలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పింది. విడుదలకి ఇంకా వారం రోజులు సమయం ఉండగానే, అప్పుడే 10,000కు పైగా టికెట్లు అమ్ముడవడంతో మెగాస్టార్ క్రేజ్ మరోసారి రుజువైంది.

సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇందులో విక్టరీ వెంటేశ్ ఓ కీలక పాత్రల కనిపించనున్నారు. చిరంజీవి వింటేజ్ లుక్, వెంకటేశ్ మార్క్ కామెడీ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. యూకేలో ఒక రోజు ముందుగానే, అంటే జనవరి 11న గ్రాండ్ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు.

ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అహింసా ఫిల్మ్స్, సరిగమ సినిమాస్, బోలిన్ సినిమా (UK) కలిసి ఈ చిత్రాన్ని యూకేలో భారీ ఎత్తున విడుదల చేస్తున్నాయి. ఈ సంక్రాంతికి ఇది అతిపెద్ద ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


More Telugu News