బాహుబలి బ్యాటరీతో ఒప్పో నుంచి అదిరిపోయే ఫోన్.. భారత మార్కెట్లోకి ఎంట్రీ

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 రోజుల పాటు స్టాండ్‌బై 
  • 64 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అయ్యేలా 80W సూపర్ ఊక్ టెక్నాలజీ
  • ఐపీ69 రేటింగ్‌తో నీరు, దుమ్ము నుంచి ఫోన్‌కు పూర్తి రక్షణ
  • ప్రారంభ ధర రూ. 21,999.. బ్యాంక్ ఆఫర్లతో అదనపు తగ్గింపు
స్మార్ట్‌ఫోన్ వాడకం ఎక్కువై ఛార్జింగ్ త్వరగా అయిపోతోందని బాధపడే వారికి ఒప్పో తీపి కబురు అందించింది. ఏకంగా 7,000mAh బ్యాటరీతో కూడిన తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ 'ఒప్పో A6 ప్రో 5G'ని సోమవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. భారీ బ్యాటరీతో పాటు వేగవంతమైన ఛార్జింగ్, అత్యాధునిక ఫీచర్లతో మధ్యతరగతి వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను రూపొందించింది.

ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ సామర్థ్యం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 40 రోజుల పాటు స్టాండ్‌బై పవర్‌ను ఇది ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అంత పెద్ద బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి వీలుగా 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని కల్పించారు. దీనివల్ల కేవలం 64 నిమిషాల్లోనే సున్నా నుంచి వంద శాతం ఛార్జింగ్ పూర్తి చేసుకోవచ్చు.

ఒప్పో A6 ప్రో 5G రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది
8GB RAM + 128GB వేరియంట్ ధర రూ. 21,999
8GB RAM + 256GB వేరియంట్ ధర రూ. 23,999

హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ వంటి ప్రముఖ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 2,000 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. అరోరా గోల్డ్, కాపుచినో బ్రౌన్ రంగుల్లో లభించే ఈ ఫోన్ ఇప్పటికే ఒప్పో ఆన్‌లైన్ స్టోర్‌లో విక్రయానికి సిద్ధంగా ఉంది.

అద్భుతమైన ఫీచర్లు
6.75-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో గేమింగ్, వీడియో వీక్షణకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేసే ఈ హ్యాండ్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్-ఓఎస్ 15పై రన్ అవుతుంది. ఫొటోగ్రఫీ కోసం వెనుక వైపు 50MP ప్రధాన కెమెరా, సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు. నీటిలో పడినా లేదా దుమ్ములో ఉన్నా ఫోన్ చెడిపోకుండా ఉండేలా దీనికి ఐపీ69 రేటింగ్ కల్పించడం విశేషం. 


More Telugu News