ప్రియురాలిని పెళ్లి చేసుకోబోతున్న శిఖర్ ధావన్

  • ఫిబ్రవరి మూడవ వారంలో ఒక్కటి కానున్న ధావన్, సోఫీ
  • ఢిల్లీలో జరగనున్న వివాహానికి హాజరు కానున్న ప్రముఖులు
  • 2012లో ఆయేషాను పెళ్లాడిన శిఖర్ ధావన్
  • మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్న ఆయేషా, ధావన్
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఫిబ్రవరిలో వివాహం చేసుకోనున్నాడు. ధావన్, అతడి ప్రేయసి సోఫీ షైన్ వచ్చే నెల మూడవ వారంలో ఒక్కటి కానున్నారు. ఢిల్లీ వేదికగా జరగనున్న ఈ వివాహ వేడుకకు క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖులు హాజరు కానున్నట్లు సమాచారం. ఈ వివాహ వేడుకకు ఇప్పటి నుంచే సన్నాహాలు జరుగుతున్నాయి.

ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్‌తో ధావన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను సోఫీతో కలిసి వీక్షించడంతో ఆమె పేరు వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజుల క్రితం ఒక కార్యక్రమంలో పాల్గొన్న ధావన్‌ను విలేకరులు గర్ల్ ఫ్రెండ్ గురించి అడిగారు.

దానికి అతడు స్పందిస్తూ, "నేను ఆమె పేరు చెప్పను కానీ, నా ప్రపంచంలో అత్యంత అందమైన అమ్మాయి ఆమె మాత్రమే" అని వ్యాఖ్యానించాడు.

శిఖర్ ధావన్ 2012లో ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ ఆయేషా ముఖర్జీని వివాహం చేసుకున్నాడు. 2014లో వీరికి ఒక బాబు జన్మించాడు. మనస్పర్థలు రావడంతో 2020 నుంచి వారు దూరంగా ఉంటున్నారు. అనంతరం మూడేళ్లకు విడాకులకు దరఖాస్తు చేసుకోగా, ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.


More Telugu News