Revanth Reddy: ఈ నెల 18న మేడారంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Revanth Reddy to Visit Medaram on 18th of this Month
  • జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర
  • ఈ నెల 19న మేడారం గద్దెల పునరుద్ధరణ
  • రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దెల పునరుద్ధరణ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 18న మేడారం వెళ్లనున్నారు. జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మహా జాతరకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. అమ్మవార్ల గద్దెల పునరుద్ధరణతో పాటు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.

వేలాది మంది భక్తులు నిలువెత్తు బంగారంతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నెల 19న మేడారం గద్దెల పునరుద్ధరణ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పునరుద్ధరణ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సహా మంత్రులు హాజరు కానున్నారు.

కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, సభాపతి, ఇతర మంత్రులకు మేడారం మహా జాతరకు ఆహ్వానం అందింది. అసెంబ్లీలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ ఆహ్వాన పత్రికలను అందించారు. మేడారం అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.230 కోట్లు కేటాయించింది.

మేడారంలో ఇప్పటికే భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి సుమారు 2 లక్షల మంది భక్తులు తరలి వచ్చారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, జంపన్న, నాగులమ్మకు ముడుపులు కట్టి తమ భక్తిని చాటుకున్నారు. గద్దెల వద్ద పసుపు, కుంకుమ సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
Revanth Reddy
Medaram Jatara
Telangana
Sammakka Saralamma Jatara
Maha Jatara
Gaddela Punaruddharana

More Telugu News