Gurmeet Ram Rahim Singh: అత్యాచారం కేసులో దోషి.. పెరోల్‌పై 15వ సారి బయటకు వచ్చిన డేరా బాబా

Gurmeet Ram Rahim Singh Released on Parole Again
  • 40 రోజుల పెరోల్ పొందడంతో సునారియా జైలు నుంచి బయటకొచ్చిన గుర్మీత్
  • 2017లో దోషిగా తేలినప్పటి నుంచి 15వసారి పెరోల్
  • సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయంలో ఉంటాడని గుర్మీత్ అధికార ప్రతినిధి వెల్లడి
డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ 40 రోజుల పెరోల్ పొందడంతో సోమవారం సునారియా జైలు నుంచి విడుదలయ్యారు. తన ఇద్దరు భక్తురాళ్లపై అత్యాచారం చేసినందుకు 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన, 2017లో దోషిగా తేలినప్పటి నుంచి పెరోల్‌పై బయటకు రావడం ఇది 15వ సారి కావడం గమనార్హం.

పెరోల్ కాలంలో, ఆయన హర్యానాలోని సిర్సాలో గల డేరా ప్రధాన కార్యాలయంలో ఉంటారని ఆ శాఖ ప్రతినిధి మరియు న్యాయవాది జితేందర్ ఖురానా తెలిపారు.

16 సంవత్సరాల క్రితం జ‌ర్న‌లిస్టు హత్య కేసులోనూ గుర్మీత్ సింగ్‌ను కోర్టు 2019లో దోషిగా తేల్చింది. గతంలో 2025 ఏప్రిల్‌లో 21 రోజులు, 2025 ఆగ‌స్ట్‌లో కూడా 40 రోజుల పెరోల్‌పై ఆయన బయటకు వచ్చారు. మరోవైపు గుర్మీత్ సింగ్‌కు పెరోల్ ఇవ్వడాన్ని సిక్కు సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి.
Gurmeet Ram Rahim Singh
Dera Sacha Sauda
rape case
parole
Sunaria jail
Haryana
Sirsa

More Telugu News