కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు: కవిత పార్టీ ప్రకటనపై బీజేపీ అధ్యక్షుడు

  • ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చన్న రామచందర్ రావు
  • కవిత పార్టీ పెట్టడం వల్ల మాకు వచ్చే నష్టమేమీ లేదన్న అధ్యక్షుడు
  • కవిత ఆత్మగౌరవం దెబ్బతినడం ఆమె కుటుంబానికి సంబంధించిన అంశమని వ్యాఖ్య
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానన్న ప్రకటనపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చని, కేఏ పాల్ కూడా ఒక పార్టీ స్థాపించారని ఆయన గుర్తు చేశారు. ఆత్మగౌరవం దెబ్బతిన్నదని కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, అది వారి కుటుంబానికి సంబంధించిన విషయమని అన్నారు. ఆమె పార్టీ పెట్టడం వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

వీబీ జీ రామ్‌ జీ పథకాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని రామచందర్ రావు ఖండించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఎవరికీ ఒరిగిందేమీ లేదని ఆయన అన్నారు. పలు రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. పారదర్శకత లేని పథకాలే కాంగ్రెస్ పార్టీకి కావాలని ఆయన విమర్శించారు.


More Telugu News