Anasuya Bharadwaj: అనసూయపై సీనియర్ నటి రాశి పరోక్షంగా ఫైర్!
- శివాజీ వ్యాఖ్యల విషయంలో రాశి ఎంట్రీ
- శివాజీ వ్యాఖ్యల్లో కొన్ని పదాలు మాత్రమే తప్పుగా వచ్చాయన్న రాశి
- దానికి ఆయన క్షమాపణలు కూడా చెప్పారని వ్యాఖ్య
టాలీవుడ్‌లో మరోసారి ఓ పెద్ద వివాదం దుమారం రేపుతోంది. సీనియర్ నటుడు శివాజీ ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహిళల వస్త్రధారణపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. తెలంగాణ మహిళా కమిషన్ కూడా ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచింది. ఈ కామెంట్స్‌పై నటి అనసూయ భరద్వాజ్ తీవ్రంగా స్పందించి, మహిళలకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇలాంటి మాటలు సమాజంలో తప్పుడు సందేశం ఇస్తాయని ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.
చిన్మయి వంటి మరికొందరు కూడా శివాజీపై ధ్వజమెత్తారు. అయితే కొందరు శివాజీకి సపోర్ట్ చేస్తూ, ఆయన మాటల్లో తప్పేమీ లేదని, సమాజంలో డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడడం సహజమని వాదిస్తున్నారు.
ఈ వివాదంలోకి ఇప్పుడు సీనియర్ నటి రాశి కూడా ఎంట్రీ ఇచ్చారు. రాశి మాట్లాడుతూ, శివాజీ తనకు చాలా ఏళ్లుగా తెలుసు, ఆయన చేసిన కామెంట్స్ పూర్తిగా తప్పు కాదు కానీ కొన్ని పదాలు మాత్రం తప్పుగా వచ్చాయని, అందుకు ఆయన సారీ కూడా చెప్పారని అన్నారు.
అనసూయపై కౌంటర్ ఇస్తూ, నాలుగేళ్ల క్రితం ఓ షోలో 'రాశి ఫలాలు' అని పలకాల్సిన చోట 'రాశి గారి ఫలాలు' అని అనసూయ చెప్పి నవ్వుకున్నారని, అందులో తన పేరును ఫన్నీగా ఉపయోగించారని పేర్కొన్నారు. మైక్ దొరికింది కదా అని ఏమైనా మాట్లాడకూడదని పేరు చెప్పకుండా అనసూయకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.