Nidhi Agarwal: ఇది ఏఐ కాదు... ప్రభాస్ తో ఫొటో పంచుకున్న నిధి

Nidhi Agarwal Shares Photo With Prabhas Not AI
షార్ట్స్‌లో చూడండి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం 'ది రాజాసాబ్' సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. హారర్ కామెడీ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజాసాబ్ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో హీరోయిన్ నిధి అగర్వాల్ తన సోషల్ మీడియా ఖాతాలో ఆసక్తికర ఫొటో పంచుకుంది. అందులో ఆమె ప్రభాస్ తో కలిసి చిరునవ్వులు చిందిస్తోంది. "ఇది ఏఐ ఫొటో కాదు" అంటూ అమ్మడు క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ పిక్ ను ప్రభాస్ ఫ్యాన్ప్ విశేషంగా లైక్ చేస్తున్నారు.

ఈ సినిమా విషయానికొస్తే... ఈ చిత్రం మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకువస్తోంది. ఓవర్సీస్‌లో, ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్‌లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ చిత్రం 450,000 డాలర్లు (సుమారు రూ. 3.75 కోట్లు) మార్కును దాటినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఈ సినిమా విడుదలకు ఒకరోజు ముందే, అంటే జనవరి 8న భారత్, నార్త్ అమెరికాలో పెయిడ్ ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి తన పూర్వీకుల ఆస్తిని అమ్మాలనుకున్న కథానాయకుడికి అక్కడ ఎదురైన అనుభవాలే ఈ సినిమా కథాంశం. ఈ చిత్రంలో ప్రభాస్‌కు తాత ఆత్మ రూపంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మొదట ఈ సినిమా రన్‌టైమ్ 3 గంటల 9 నిమిషాలుగా వార్తలు రాగా, తాజాగా కొన్ని సన్నివేశాలను తొలగించి నిడివిని సుమారు 2 గంటల 55 నిమిషాలకు కుదించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ మేకోవర్, నటన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుందని దర్శకుడు మారుతి ధీమా వ్యక్తం చేశారు. జనవరి 7 నుంచి నైజాం ఏరియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.
Go Back to Shorts
Nidhi Agarwal
Prabhas
The Raja Saab
Maruthi
Telugu Movie
Sanjay Dutt
Horror Comedy
Malavika Mohanan
People Media Factory

More Telugu News