Nitin Gadkari: రోడ్డు విస్తరణలో మా మామ ఇంటినే తొలగించాం: నితిన్ గడ్కరీ

Nitin Gadkari Reveals Demolition of Uncles House for Road Expansion
  • కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ యూట్యూబ్ వ్లాగ్‌లో తెలిపిన కేంద్రమంత్రి
  • తన కుక్‌తో కలిసి ఢిల్లీలోని గడ్కరీ ఇంటికి వెళ్లిన ఫరా ఖాన్
  • తన మామకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం మాత్రమే ఇచ్చినట్లు వెల్లడి
గతంలో ఒకసారి రోడ్డు విస్తరణ పనులు చేపట్టినప్పుడు అడ్డుగా ఉన్న తన సొంత మామ ఇంటిని సైతం తొలగించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. పని విషయంలో తనకు అందరూ సమానమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ యూట్యూబ్ వ్లాగ్‌లో కేంద్రమంత్రి ఈ విషయాలు తెలిపారు. తన కుక్ దిలీప్‌తో కలిసి ఫరా ఖాన్ ఢిల్లీలోని గడ్కరీ నివాసాన్ని సందర్శించారు. గడ్కరీ తన భార్య కాంచన్‌తో కలిసి ఫరా ఖాన్ వ్లాగ్‌లో పాల్గొన్నారు.

తన గ్రామంలో రోడ్డు వేయాలని ఫరా ఖాన్ కుక్ దిలీప్ వ్లాగ్‌లో కేంద్రమంత్రిని అభ్యర్థించారు. దీంతో అతడి ఇంటి మీదుగా రోడ్డు వేయాలని ఫరా ఖాన్ చమత్కరించారు. ఈ సమయంలో అక్కడే ఉన్న కాంచన్ మాట్లాడుతూ, రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉందని తన తండ్రి ఇంటిని గడ్కరీ కూల్చివేశారని వెల్లడించడంతో వారంతా ఆశ్చర్యపోయారు.

మీ మామకు కొత్త ఇల్లు కట్టించి ఇచ్చారా అని ఫరా ఖాన్ గడ్కరీని అడగగా, రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తన మామ ఇంటిని కూల్చివేయవలసి వచ్చిందని ఆయన బదులిచ్చారు. ఇల్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం నుంచి అందే పరిహారం అందేలా చూశామని చెప్పారు.
Nitin Gadkari
Road expansion
Farah Khan
YouTube vlog
Kanchana Gadkari
Delhi
Road construction

More Telugu News