Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఘనమైన ఆరంభం: సీఎం చంద్రబాబు

Andhra Pradesh Gets Great Start Says CM Chandrababu Naidu
  • పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే ఏపీకి అగ్రస్థానం
  • బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికలో వెల్లడైన గణాంకాలు
  • దేశంలోని మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం ఏపీకి
పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. 2026 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలానికి (ఏప్రిల్-డిసెంబర్ 2025) దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం పెట్టుబడి ప్రతిపాదనల్లో ఏపీ ఏకంగా 25.3 శాతం వాటాను దక్కించుకుంది. ఈ విషయాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా తన తాజా ఆర్థిక నివేదికలో వెల్లడించింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఈ మేరకు ఫోర్బ్స్ బిజినెస్ మేగజైన్ ఓ కథనం వెలువరించింది.

దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ప్రజలకు శుభవార్త అని, కొత్త సంవత్సరానికి బలమైన ఆరంభమని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వ ముందుచూపుతో కూడిన విధాన సంస్కరణల వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. "ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త, కొత్త సంవత్సరానికి ఘనమైన ఆరంభం. మా ముందుచూపుతో కూడిన విధాన సంస్కరణల ప్రభావాన్ని, ప్రత్యేకించి, సకాలంలో మరియు పారదర్శకంగా ప్రోత్సాహకాల పంపిణీ కోసం ఎస్క్రో-ఆధారిత యంత్రాంగాన్ని ప్రవేశపెట్టడం, అలాగే స్పష్టమైన, రంగాల వారీ విధానాలను ప్రవేశపెట్టడం వంటి 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' కార్యక్రమాల ప్రభావాన్ని ఇది ప్రతిబింబిస్తుంది" అని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంపై నమ్మకముంచి పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన ఇన్వెస్టర్లకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం, ఈ తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా మొత్తం రూ.26.6 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ తర్వాత ఒడిశా (13.1 శాతం), మహారాష్ట్ర (12.8 శాతం) రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ మూడు రాష్ట్రాలు కలిపి దేశంలోని మొత్తం పెట్టుబడి ప్రతిపాదనల్లో 51.2 శాతం వాటాను ఆకర్షించడం గమనార్హం.
Chandrababu Naidu
Andhra Pradesh investments
AP investments
Bank of Baroda report
CMIE data
Forbes Business Magazine
investment proposals
economic growth
Andhra Pradesh economy
Ease of Doing Business

More Telugu News