Aleti Maheshwar Reddy: షేర్వాణీలు వేసుకుని వస్తే మీరు బెల్లు కొట్టడం లేదు: అసెంబ్లీలో నవ్వులు పూయించిన బీజేపీ ఎమ్మెల్యే
- మేం మాట్లాడితే బెల్లు కొడుతున్నారన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- మేం కూడా షేర్వాణీ వేసుకుని వస్తామని ప్రభుత్వానికి చురక
- కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని సీఎం చెప్పారని గుర్తు చేసిన ఎమ్మెల్యే
బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "అధ్యక్షా, మేం మాట్లాడితే బెల్లు కొడుతున్నారు. కానీ మా పక్కనున్న షేర్వాణీ వేసుకున్న మిత్రులు మాట్లాడితే మాత్రం ఏ రోజు బెల్లు కొట్టలేదు. అలా అయితే మేమూ షేర్వాణీలు వేసుకుని వస్తాం" అంటూ సభలో హాస్యాన్ని పండించారు.
కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారని, మీకు మీకు స్నేహం ఉందనే విషయం తనకు తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. అయితే అలా మాట్లాడటం సముచితం కాదని స్పీకర్ పేర్కొన్నారు.
తెలంగాణలో కుక్కకాట్లు పెరుగుతున్నాయి: అక్బరుద్దీన్ ఒవైసీ
తెలంగాణ రాష్ట్రంలో కుక్కకాట్లు పెరుగుతున్నాయని మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఎవరినీ కించపరచడం లేదని, కానీ కుక్క కాట్లు పెరగడం ఆందోళనకరమని అన్నారు. జంతు సంరక్షణ సంస్థలు వచ్చి కుక్కలను పట్టుకోవద్దని, చంపవద్దని చెబుతుంటారని, కానీ అవే కుక్కలు చిన్న పిల్లలను కూడా కరుస్తున్నాయని ఈ విషయాన్ని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.