Telangana Intermediate Board: తల్లిదండ్రులకు వాట్సాప్ లో హాల్ టిక్కెట్లు... ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
- ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు
- హాల్ టిక్కెట్లు ముందే వాట్సాప్ చేస్తే తప్పులు సరిదిద్దే అవకాశముంటుందని వెల్లడి
- హాల్ టిక్కెట్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని తల్లిదండ్రులకు సూచన
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ విద్యార్థులకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల హాల్ టిక్కెట్లను వారి తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా పంపనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. హాల్ టిక్కెట్లను వాట్సాప్ చేయడం ద్వారా వాటిలో ఏవైనా పొరపాట్లు ఉంటే పరీక్షలకు ముందే గుర్తించే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, పరీక్షలకు 2 నెలల ముందే తల్లిదండ్రులకు హాల్ టిక్కెట్లను వాట్సాప్ చేయనున్నట్లు వెల్లడించారు. చాలా మంది తల్లిదండ్రుల వద్ద స్మార్ట్ ఫోన్లు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.
విద్యార్థుల తల్లిదండ్రులు హాల్ టిక్కెట్‌లో ముద్రించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఏమైనా తప్పులుంటే సంబంధిత కళాశాల ప్రిన్సిపల్‌కు తెలియజేయాలని ఇంటర్ బోర్డు సూచించింది. అలాగే హాల్ టిక్కెట్ నెంబర్, పరీక్ష కేంద్రం చిరునామా, ఏ రోజు ఏ పరీక్ష జరుగుతుందో తల్లిదండ్రులకు తెలియజెప్పడమే ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.