Arvind Srinivas: డేటా సెంటర్లకు అతిపెద్ద ముప్పు ఆన్-డివైజ్ ఏఐ: పర్‌ఫ్లెక్సిటీ సీఈవో
- భవిష్యత్తులో డివైజ్‌లు ఇన్‌బిల్ట్ ఏఐతో వస్తాయన్న అరవింద్ శ్రీనివాస్
- ఆన్-డివైజ్ ఏఐ మోడల్స్‌తో డేటా సెంటర్లకు అతిపెద్ద ముప్పు ఉందన్న పర్‌ఫ్లెక్సిటీ సీఈవో
- డివైజ్‌లలోనే ఏఐతో కూడిన చిప్‌లు అమర్చితే డేటా సెంటర్ల అవసరం ఉండదని వ్యాఖ్య
గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ, పర్‌ఫ్లెక్సిటీ వంటి అగ్రగామి టెక్ సంస్థలు డేటా సెంటర్లలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ దశాబ్దం చివరి నాటికి మొత్తం పెట్టుబడులు దాదాపు 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో పర్‌ఫ్లెక్సిటీ సీఈవో అరవింద్ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాబోయే రోజుల్లో ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు వంటి పరికరాలు అంతర్గత కృత్రిమ మేధస్సు (ఏఐ)తోనే వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆన్-డివైజ్ ఏఐ మోడల్స్ వల్ల డేటా సెంటర్లకు అతిపెద్ద ముప్పు వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు.
పరికరాల్లోనే ఏఐ ఆధారిత చిప్‌లను అమర్చడం ద్వారా కేంద్రీకృత డేటా సెంటర్ల నుంచి ఏఐ సేవలను వినియోగించాల్సిన అవసరం ఉండకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆన్-డివైజ్ ఏఐ మోడల్స్ వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని, ఏఐ మోడల్ వారి పరికరంలోనే ఉండటం వల్ల వారి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు.