Chiranjeevi: మెగా ఫ్యాన్స్ కు పండుగ... ఎల్లుండి 'మన శంకర వరప్రసాద్ గారు ' ట్రైలర్ రిలీజ్

Mana Shankara Vara Prasad Garu Trailer Release on January 4
  • జనవరి 4న 'మన శంకర వర ప్రసాద్' థియేట్రికల్ ట్రైలర్
  • సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల
  • తొలిసారి వెండితెరపై కలిసి కనిపించనున్న చిరంజీవి, వెంకటేశ్
  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్
  • ఇప్పటికే ప్రారంభమైన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న మాస్ ఎంటర్టయినర్ చిత్రం 'మన శంకర వర ప్రసాద్ గారు' ట్రైలర్‌పై చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను జనవరి 4న విడుదల చేయనున్నట్లు ఓ కొత్త పోస్టర్‌ ద్వారా వెల్లడించింది. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండటం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. చిరంజీవి, వెంకటేశ్ కలిసి నటిస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి, చిరంజీవి కామెడీ టైమింగ్‌ను కొత్త కోణంలో ఆవిష్కరిస్తూ, పూర్తిస్థాయి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ప్రమోషన్లలో భాగంగా, జనవరి 7న ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే యూఎస్‌ఏలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 
Chiranjeevi
Mana Shankara Vara Prasad Garu
Venkatesh
Nayanthara
Anil Ravipudi
Sankranti
Telugu Movie
Shine Screens
Gold Box Entertainments

More Telugu News