రేణు దేశాయ్ ఒడిలో ఉన్న ఆ పసిపాప ఎవరు?.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్!

  • సోషల్ మీడియాలో రేణు దేశాయ్ న్యూ ఇయర్ పోస్ట్
  • ఒడిలో పసిపాపతో ఉన్న ఫొటో షేర్ చేసిన నటి
  • కామెంట్స్ సెక్షన్ ఆఫ్ చేయడంపై నెటిజన్ల చర్చ
  • ప్రస్తుతం పదహారు రోజుల పండుగ చిత్రంలో రేణు నటన
  • 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన వైనం
సీనియ‌ర్‌ నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా నూతన సంవత్సరం సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. 2025కి వీడ్కోలు పలుకుతూ, 2026కి స్వాగతం చెబుతూ ఆమె ఓ పసిపాపను ఒడిలో కూర్చోబెట్టుకున్న ఫొటోను పోస్ట్ చేశారు.

ఈ ఫొటోకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ అందరినీ ఆకట్టుకుంటోంది. "పసిపిల్లలు తమ రెక్కలను దాచుకున్న దేవదూతల్లా ఉంటారు. ఈ చిన్నారి తన ముద్దులొలికే రూపంతో నా మనసును దోచుకున్నాడు" అని రేణు రాసుకొచ్చారు. అయితే, సాధారణంగా అభిమానులతో ముచ్చటించే రేణు, ఈ ఒక్క పోస్ట్‌కు మాత్రం కామెంట్స్ సెక్షన్‌ను ఆఫ్ చేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది. దీంతో రేణు ఒడిలో ఉన్న ఆ చిన్నారి ఎవరు అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రోల్స్, అవాంఛిత కామెంట్లను నివారించేందుకే ఆమె ఇలా చేసి ఉంటారని కొందరు భావిస్తున్నారు.

ఇక, ఆమె కెరీర్ విషయానికి వస్తే.. పవన్ కల్యాణ్‌తో విడాకుల తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న రేణు, రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె సాయి కిరణ్ అడివి దర్శకత్వం వహిస్తున్న ‘పదహారు రోజుల పండుగ’ అనే సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. నటిగా తన సెకండ్ ఇన్నింగ్స్‌లో వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ రేణు దేశాయ్ బిజీగా మారుతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఆమె అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోను కూడా విడుదల చేశారు.


More Telugu News