Purkan Bhat: పాలస్తీనా జెండాతో క్రికెట్ ఆడిన జమ్మూకశ్మీర్ క్రికెటర్.. పోలీసుల సమన్లు

Purkan Bhat Palestine Flag Controversy in Jammu Kashmir Cricket Match
  • జేకే11 టీమ్ తరఫున దేశవాళీలో ఆడిన పుర్కాన్ భట్
  • పుర్కాన్ హెల్మెట్‌పై పాలస్తీనా జెండా
  • క్రికెటర్, నిర్వాహకుడికి సమన్లు జారీ చేసిన గ్రామీణ పోలీసులు
జమ్మూకశ్మీర్‌లో ఓ క్రికెట్ లీగ్ మ్యాచ్ సందర్భంగా ఒక క్రికెటర్ పాలస్తీనా జెండాను ఉపయోగించడం వివాదాస్పదమైంది. జమ్మూకశ్మీర్ ఛాంపియన్స్ లీగ్‌లో మ్యాచ్ ఆడుతున్న సమయంలో పుర్కాన్ భట్ హెల్మెట్‌పై పాలస్తీనా జెండా కనిపించింది. దీంతో జమ్ము రూరల్ పోలీసులు క్రికెటర్‌ను, టోర్నమెంట్ నిర్వాహకుడు జాహిద్ భట్‌ను విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు.

జమ్మూకశ్మీర్‌ ఛాంపియన్స్ లీగ్ లో పుర్కాన్ భట్ జేకే11 జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. నిన్న జమ్ము ట్రయల్‌బ్లేజర్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా అతని హెల్మెట్‌కు పాలస్తీనా జెండా కనిపించింది. మ్యాచ్ జరగడానికి తన మైదానాన్ని ఇచ్చిన వ్యక్తిని కూడా పోలీసులు ప్రశ్నించనున్నారు.

కాగా, ఈ లీగ్ మ్యాచ్‌లో జేకే11 జట్టు 8 పరుగుల తేడాతో జమ్ము ట్రయల్‌బ్లేజర్స్‌పై విజయం సాధించింది. హర్‌ప్రీత్ సింగ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
Purkan Bhat
Palestine flag
Jammu Kashmir
JK Champions League
Cricket match
Jammu Rural Police
Zahid Bhat
JK11
Harpreet Singh

More Telugu News