Gas Cylinder Price Hike: నూతన సంవత్సరం వేళ గ్యాస్ సిలిండర్ షాక్.. రూ.111 పెరిగిన వాణిజ్య సిలిండర్

Gas Cylinder Price Hike Commercial Cylinder Price Increased by Rs 111
  • 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను పెంచిన చమురు కంపెనీలు
  • గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధర యథాతధం
  • భారీగా తగ్గిన విమాన జెట్ ఫ్యూయల్ ధర
నూతన సంవత్సరంలో దేశీయ హోటళ్లు, రెస్టారెంట్లు, సర్వీస్ ఆపరేటర్లకు చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను రూ.111 పెంచాయి. అయితే, ఈ పెరుగుదల గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్‌కు వర్తించదు. గృహ అవసరాల ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

తాజా సవరణతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.111 పెరిగి రూ.1,691.50కి చేరుకుంది. ముంబైలో రూ.1,531.50 నుంచి రూ.1,642.5కు, కోల్‌కతాలో రూ.1,684 నుంచి రూ.1,795కి, చెన్నైలో రూ.1,739.50 నుంచి రూ.1,849.50కి పెరిగింది. అదే సమయంలో విమానాల్లో వాడే ఇంధనం ఏటీఎఫ్ ధర భారీగా తగ్గింది. ఢిల్లీలో జెట్ ఇంధనం కిలో లీటర్‌కు రూ.7,353 తగ్గింది.
Gas Cylinder Price Hike
Commercial Gas Cylinder
LPG Price
Delhi Gas Price
Mumbai Gas Price

More Telugu News