నూతన సంవత్సరం.. తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు

  • డిసెంబర్ చివరి మూడు రోజుల్లో రూ.1.000 కోట్ల మద్యం విక్రయాలు
  • చివరి మూడు రోజుల్లో 8.30 లక్షల కేసుల లిక్కర్, 7.78 లక్షల కేసుల బీర్ల విక్రయాలు
  • డిసెంబర్ 30న రూ.520 కోట్ల అమ్మకాలు
నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీగా నమోదయ్యాయి. డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో కలిపి మూడు రోజుల్లోనే సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడైనట్లు అధికారులు వెల్లడించారు.

ఈ మూడు రోజుల్లో 8.30 లక్షల కేసుల లిక్కర్, 7.78 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఆరు రోజుల్లో మొత్తం రూ.1,350 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 30న రికార్డు స్థాయిలో రూ.520 కోట్ల అమ్మకాలు జరగగా, 31న రూ.370 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.

తెలంగాణలో డిసెంబర్ మొదటి పదిహేను రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల కారణంగా కూడా మద్యం విక్రయాలు అధికంగా జరిగాయి. డిసెంబర్ నెలలో నూతన సంవత్సర వేడుకలతో పాటు పంచాయతీ ఎన్నికలు కూడా ఉండటంతో 2024 డిసెంబర్‌తో పోలిస్తే మద్యం విక్రయాలు రూ.1,349 కోట్లు అధికంగా జరిగాయి.


More Telugu News