న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం.. బిర్యానీ తిని ఒకరి మృతి
- జగద్గిరిగుట్టలో న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం
- పార్టీలో బిర్యానీ తిని ఒకరి మృతి.. 15 మందికి అస్వస్థత
- అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
తెలంగాణ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. పబ్బులు, క్లబ్బులు, రిసార్టులతో పాటు ఇళ్లలోనూ జనం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నారు. అయితే, ఈ సంబరాల వేళ హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో చోటుచేసుకున్న ఓ ఘటన విషాదాన్ని నింపింది. నిన్న రాత్రి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్న ఒకరు మృతి చెందగా, మరో 15 మంది ఆసుపత్రి పాలయ్యారు.
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానినగర్‌లో ఈ ఘటన జరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా సుమారు 17 మంది ఒకచోట చేరి మద్యం సేవించారు. అనంతరం అందరూ కలిసి బిర్యానీ తిన్నారు. అయితే, భోజనం చేసిన కొద్దిసేపటికే వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పాండు (53) అనే వ్యక్తి పరిస్థితి విషమించి మృతి చెందాడు. మిగిలిన 15 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.