అపార్టుమెంట్‌లో అగ్ని ప్రమాదం... జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి

  • జనగామ జిల్లా జిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన హృతిక్ రెడ్డి మృతి
  • అగ్నిప్రమాదం జరగడంతో భవనంపై నుంచి దూకిన విద్యార్థి
  • తలకు తీవ్ర గాయమై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
జర్మనీలో ఒక తెలుగు విద్యార్థి తాను నివసిస్తున్న భవనం పైనుండి కిందకు దూకి మరణించాడు. మృతుడు తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, చిల్పూర్ మండలం, మల్కాపూర్ గ్రామానికి చెందిన తోకల హృతిక్ రెడ్డి. ఉన్నత చదువుల కోసం అతను జర్మనీ వెళ్ళాడు. అతను ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది.

ఆ సమయంలో మంటల నుండి తప్పించుకునే ప్రయత్నంలో హృతిక్ రెడ్డి భవనం పైనుండి దూకాడు. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. హృతిక్ రెడ్డి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.  


More Telugu News