Srinivas Manne: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనిపించింది: దర్శకుడు శ్రీనివాస్ మన్నె

Srinivas Manne Felt Suicidal During Eesha Movie Negativity
  • బుక్ మై షోలో ఈషా సినిమాపై తీవ్ర నెగటివిటీ కనిపించిందన్న శ్రీనివాస్ మన్నె
  • అఖరికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిందని వెల్లడి
  • హైదరాబాద్‌ లో సక్సెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం
బుక్‌మైషోలో 'ఈషా' చిత్రంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సమయంలో తనకు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని దర్శకుడు శ్రీనివాస్ మన్నె సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసి బాగుందని చెప్పినా, బుక్‌మైషోలో మాత్రం ప్రతికూల ఫలితాలు కనిపించడంతో ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందన్నారు. అయితే, చివరికి ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ‘ఈషా’ సినిమా సక్సెస్‌ మీట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

త్రిగుణ్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు ప్రధాన పాత్రల్లో శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈషా’ చిత్రాన్ని పి. హేమ వెంకటేశ్వరరావు నిర్మించగా, కేఎల్ దామోదర్ ప్రసాద్ సమర్పించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి ద్వారా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ఈ సినిమా సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత డి. సురేశ్ బాబు మాట్లాడుతూ చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా ఏమీ లేదని, కంటెంట్ బాగుంటే ఏ సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారన్నారు. ప్రేక్షకులు పెట్టే డబ్బుకు, వెచ్చించే సమయానికి తగిన కథను మనం అందిస్తున్నామా? లేదా? అనేది దర్శక నిర్మాతలు ఆలోచించాలన్నారు. నిజాయతీగా కష్టపడితే మనం ఎప్పుడూ విఫలం కామని, 'ఈషా' విజయంతో అది మరోసారి నిరూపితమైందన్నారు.

నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ అన్ని సినిమాలు అందరికీ నచ్చాలని లేదని, ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చకపోతే ఐదు రోజుల్లో ఆరు కోట్ల గ్రాస్ వచ్చేది కాదని అన్నారు. 
Srinivas Manne
Eesha Movie
Telugu Cinema
BookMyShow
Suicide Comments
D Suresh Babu
Bunny Vasu
Hebah Patel
Trigun
Akhil Raj

More Telugu News