హైదరాబాద్‌లో న్యూ ఇయర్ ‘కిక్కు’.. నగరంలో రికార్డు స్థాయిలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు

  • హైదరాబాద్‌లో అంబరాన్నంటిన నూతన సంవత్సర వేడుకలు
  • పోలీసుల ఆంక్షలు బేఖాతర్ చేసిన మందుబాబులు
  • ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1198 మందిపై కేసుల నమోదు
  • తెల్లవారుజాము వరకు తనిఖీలు.. భారీగా వాహనాల సీజ్
నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ భాగ్యనగర వాసులు అర్ధరాత్రి వేళ గ్రాండ్‌గా సంబరాలు చేసుకున్నారు. న్యూ ఇయర్ జోష్‌లో యువత ఆడిపాడి సందడి చేశారు. అయితే, సంబరాల పేరుతో నిబంధనలు ఉల్లంఘించిన మందుబాబులకు పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, అర్ధరాత్రి వేళ రోడ్లపై అనవసరంగా తిరగవద్దని పోలీసులు ముందుగానే హెచ్చరించినప్పటికీ, చాలామంది ఈ ఆంక్షలను బేఖాతర్ చేశారు. దీంతో పోలీసులు నగరవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు.

న్యూ ఇయర్ సందర్బంగా హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో పోలీసులు భారీ ఎత్తున డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఒక్క రాత్రికే 1,198 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన వారి వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.


More Telugu News