Telangana Police: పోలీసులకు న్యూ ఇయర్ పురస్కారాలు ప్రకటించిన తెలంగాణ సర్కార్

Telangana Government Announces New Year Awards for Police
  • విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 630 మంది పోలీసులకు పతకాలు
  • ముఖ్యమంత్రి సర్వోన్నత సేవా పతకానికి ఇంటెలిజెన్స్ ఎస్ఐ మహేష్ కుమార్ లఖాని ఎంపిక
  • ఉత్తర్వులు జారీ చేసిన హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆనంద్
నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 630 మంది పోలీసులకు పతకాలను ప్రకటించింది. ముఖ్యమంత్రి సర్వోన్నత సేవా పతకానికి ఇంటెలిజెన్స్ విభాగంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న మహేష్ కుమార్ లఖాని ఎంపికయ్యారు. ఇందుకు గాను ఆయనకు రూ.5 లక్షల రివార్డు అందజేయనున్నారు.

ఈ మేరకు హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర పోలీసు అధికారులకు 7 శౌర్య పతకాలు, 53 కఠిన సేవా పతకాలు, 16 మహోన్నత సేవా పతకాలు, 94 ఉత్తమ సేవా పతకాలు, 459 సేవా పతకాలను ప్రభుత్వం ప్రకటించింది. 
Telangana Police
Telangana government
New Year awards
police awards
Mahesh Kumar Lakhani
Telangana police officers
Anand Telangana
police medals

More Telugu News