Sara Tendulkar: సచిన్ కూతురిపై ట్రోలింగ్.. మండిపడుతున్న ఫ్యాన్స్.. అస‌లు విష‌యం ఏమిటంటే..!

Sara Tendulkar Trolled for Holding Bottle in Goa Video
  • గోవాలో ఫ్రెండ్స్‌తో కలిసి సారా టెండూల్కర్ సందడి 
  • చేతిలో బాటిల్ ఉందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్
  • సచిన్ పేరును ప్రస్తావిస్తూ నెగటివ్ కామెంట్స్
  • సారాకు మద్దతుగా నిలుస్తున్న మరికొందరు నెటిజన్లు
  • పర్సనల్ లైఫ్ ఆమె ఇష్టం.. ఇందులో తప్పుపట్టడానికి ఏముందని నెటిజన్ల ప్రశ్న
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. గోవా వీధుల్లో ఆమె తన స్నేహితులతో కలిసి నడుచుకుంటూ వెళుతున్న వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సారా చేతిలో ఒక బాటిల్ పట్టుకుని కనిపించారు. అయితే, అది బీర్ బాటిల్ అని కామెంట్ చేస్తూ కొందరు నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్‌కు దిగారు.

ఈ వీడియో ఎప్పుడు తీశారనే దానిపై స్పష్టత లేనప్పటికీ, న్యూ ఇయర్ వేడుకల సమయంలో తీసి ఉంటారని భావిస్తున్నారు. వీడియోలో సారా సాధారణంగా నడుచుకుంటూ వెళుతున్నప్పటికీ, కొందరు నెటిజన్లు మాత్రం అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ వ్యవహారంలోకి సచిన్ టెండూల్కర్ పేరును కూడా లాగుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. సచిన్ పరువు తీస్తున్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు.

అయితే, ఈ ట్రోలింగ్‌పై సారాకు సోషల్ మీడియాలో మద్దతు కూడా లభిస్తోంది. ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. "సారా చేతిలో బాటిల్ ఉంటే, సచిన్ ఆల్కహాల్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు ఎలా అవుతుంది? ఒక కూతురు డ్రింక్ తీసుకోకూడదా?" అని ఒక యూజర్ ప్రశ్నించారు. ఇందులో ట్రోల్ చేయడానికి ఏముందని, అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మరికొందరు సారాకు అండగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్‌గా మారింది.
Sara Tendulkar
Sachin Tendulkar
Sara Tendulkar Trolling
Goa
Social Media
Viral Video
Beer Bottle
Internet Trolling
New Year Celebrations
Sachin Tendulkar Daughter

More Telugu News