అతడి ఫామ్‌ను సద్వినియోగం చేసుకోండి... చెన్నై సూపర్ కింగ్స్‌కు అశ్విన్ సలహా

  • విజయ్ హజారే ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన ముంబయి బ్యాటర్ సర్ఫరాజ్ 
  • ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్న సర్ఫరాజ్
  • సర్ఫరాజ్ ఫామ్‌ను సీఎస్కే పూర్తిగా ఉపయోగించుకోావాలన్న అశ్విన్
విజయ్ హజారే ట్రోఫీలో గోవాతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అద్భుత ప్రదర్శనతో క్రికెట్ వర్గాల దృష్టిని ఆకర్షించాడు. అతను కేవలం 75 బంతుల్లో 157 పరుగులు (9 ఫోర్లు, 14 సిక్సర్లు) చేసి ప్రత్యర్థి బౌలర్లపై విధ్వంసం సృష్టించాడు. ముఖ్యంగా 56 బంతుల్లోనే శతకం పూర్తి చేసి వన్డేలు, టీ20ల్లోనూ తన సత్తా చాటుకున్నాడు.

ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా సర్ఫరాజ్ మంచి ప్రతిభ కనబరిచిన సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శనల నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సర్ఫరాజ్ ఆడనున్నాడు. వేలంలో సీఎస్కే సర్ఫరాజ్‌ను కేవలం రూ.75 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది.

ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు మాజీ క్రికెటర్ అశ్విన్ కీలక సూచన చేశాడు. సర్ఫరాజ్ భారీ ఇన్నింగ్స్‌లతో భారత జట్టులోకి తిరిగి చోటు దక్కించుకునే దిశగా ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్న అశ్విన్.. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో అతని ఫామ్‌ను సీఎస్కే పూర్తిగా ఉపయోగించుకోవాలని సూచించాడు. 


More Telugu News