Spirit Movie: ప్రభాస్ 'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసింది.. న్యూ ఇయర్ గిఫ్ట్‌గా అదిరిపోయే పోస్టర్ విడుదల

Prabhas Spirit First Look Poster Released New Year Gift
  • నూతన సంవత్సరం సందర్భంగా స్పిరిట్ ఫస్ట్ లుక్ విడుదల
  • గాయాలతో ప్రభాస్, సిగరెట్ వెలిగిస్తున్న హీరోయిన్‌ త్రిప్తి దిమ్రి
  • భారతీయ సినిమా మీ ఆజానుబాహుడిని చూస్తుందన్న సందీప్ రెడ్డి వంగా
  • కీలక పాత్రల్లో ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రెబ‌ల్‌ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ 'స్పిరిట్'. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకూ ఫ్యాన్ మేడ్ పోస్టర్లు, ఏఐ ఫోటోలతో సోషల్ మీడియాలో సందడి చేసిన ఫ్యాన్స్‌కు, మేకర్స్ న్యూ ఇయర్ సందర్భంగా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, ఈ సినిమా ఫస్ట్ అఫీషియల్ పోస్టర్ ను న్యూ ఇయర్ సందర్భంగా ఈరోజు విడుదల చేశారు.

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఈ పోస్టర్ షేర్ చేస్తూ.. "భారతీయ సినిమా.. మీ అజానబాహుడిని (AJANUBAHU) వీక్షించండి. హ్యాపీ న్యూ ఇయర్ 2026" అని క్యాప్షన్ ఇచ్చారు. పోస్టర్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. ప్రభాస్ షర్ట్ లేకుండా ఒంటి నిండా గాయాలతో ఓ కిటికీ దగ్గర నిల్చొని ఉండగా, హీరోయిన్ త్రిప్తి దిమ్రి ఆయనకు సిగరెట్ వెలిగిస్తూ కనిపిస్తున్నారు. గతంలోని గాయాలను గుర్తుచేసేలా ఉన్న ఈ పోస్టర్ లో.. ప్రభాస్ డార్క్ గ్లాసెస్, ఆఫ్ వైట్ ప్యాంట్‌తో మాస్ లుక్‌లో ఉన్నారు.

ఈ భారీ యాక్షన్ చిత్రంలో ప్రభాస్, త్రిప్తి దిమ్రి జంటగా నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రఖ్యాత కొరియన్ నటుడు డాన్ లీ (మా డాంగ్-సియోక్) కూడా ఇందులో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా, దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కాగా, ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఇటీవ‌లే ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆ పూజా కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై, సినిమాకు తొలి క్లాప్ కొట్టిన సంగతి తెలిసిందే.

Spirit Movie
Prabhas
Sandeep Reddy Vanga
Tripti Dimri
Prabhas Spirit First Look
Tollywood
Indian Cinema
Action Movie
New Year 2026

More Telugu News