కర్నూలు, కడప మీదుగా భారీ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్... కొత్త హైవేకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
- నాసిక్-షోలాపూర్-అక్కల్‌కోట్ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
- కర్నూలు, కడప మీదుగా చెన్నై వరకు రహదారి
- సూరత్-చెన్నై మధ్య ప్రయాణ సమయం 31 గంటల నుంచి 17 గంటలకు తగ్గింపు
- రూ.19,142 కోట్ల అంచనా వ్యయంతో 6 వరుసల రహదారి నిర్మాణం
- ఒడిశాలో జాతీయ రహదారి-326 విస్తరణకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్
దేశంలో మౌలిక సదుపాయాల కల్పన దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA), మహారాష్ట్రలోని నాసిక్-షోలాపూర్-అక్కల్‌కోట్ మధ్య 6 వరుసల గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రూ.19,142 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ రహదారి, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, కడప మీదుగా చెన్నై వరకు అనుసంధానం కానుంది.
374 కిలోమీటర్ల పొడవైన ఈ యాక్సెస్-కంట్రోల్డ్ హైవే నిర్మాణం ద్వారా పశ్చిమ, తూర్పు తీరాల మధ్య రవాణా వ్యవస్థ మరింత పటిష్టం కానుంది. ఈ ప్రాజెక్టుతో సూరత్-చెన్నై మధ్య ప్రయాణ దూరం 201 కిలోమీటర్లు తగ్గనుండగా, ప్రయాణ సమయం ఏకంగా 31 గంటల నుంచి 17 గంటలకు పడిపోతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టును బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (BOT) టోల్ పద్ధతిలో అభివృద్ధి చేయనున్నారు.
కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, "ఈ రోజు నాసిక్-షోలాపూర్ కారిడార్ కు ఆమోదం లభించింది. ఇది అక్కల్‌కోట్ నుంచి కర్నూలు, కడప మీదుగా చెన్నై వరకు విస్తరిస్తుంది" అని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 251 లక్షల పనిదినాలు, పరోక్షంగా 313 లక్షల పనిదినాల ఉపాధి లభిస్తుందని అంచనా.
ఇదే సమావేశంలో, ఒడిశాలోని జాతీయ రహదారి-326 (మోహన-కోరాపుట్ సెక్షన్) విస్తరణకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.1,526.21 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా గజపతి, రాయగడ, కోరాపుట్ వంటి గిరిజన జిల్లాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. ఈ పనులను ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (EPC) పద్ధతిలో 24 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రహదారి అభివృద్ధి వల్ల మోహన, కోరాపుట్ మధ్య ప్రయాణ సమయం దాదాపు 3 గంటలు ఆదా అవుతుంది.