గణతంత్ర వేడుకల్లో హిస్టారికల్ ప్రారంభం.. తొలిసారి ఆర్మీ జంతు బృందం కవాతు

  • జనవరి 26న గణతంత్ర వేడుకలో యానిమల్ కంటిజెంట్
  • కవాతులో ఒంటెలు, గొర్రాలు, డేగలు, ఆర్మీ జాగిలాలు
  • కవాతు బృందంలో భద్రత కోసం సైనికులు ఉపయోగించే జంతువులు
ఢిల్లీలోని కర్తవ్య్‌పథ్‌లో వచ్చే సంవత్సరం జనవరి 26న నిర్వహించనున్న గణతంత్ర వేడుకల కవాతులో తొలిసారి యానిమల్ కంటింజెంట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ కవాతులో రెండు ఒంటెలు, నాలుగు గుర్రాలు, నాలుగు డేగలు, పది స్వదేశీ ఆర్మీ జాగిలాలు, ఇప్పటికే సేవల్లో ఉన్న మరో ఆరు జాగిలాలు ఈ బృందంలో ఉండనున్నాయి.

రీమౌంట్ అండ్ వెటర్నరీ కార్ప్స్ (ఆర్వీసీ) విభాగానికి చెందిన శిక్షణ పొందిన జంతువులను ఈ కవాతులో ప్రదర్శించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దేశంలోనే అత్యంత సవాళ్లతో కూడిన సరిహద్దుల వద్ద భద్రత కోసం సైనికులు ఉపయోగించే జంతువులు ఈ బృందంలో ఉన్నాయి.

లడఖ్‌లోని శీతల ఎడారులలో కార్యకలాపాల కోసం ఇటీవల చేరిన బాక్ట్రియన్ ఒంటెలు ఈ కవాతులో నాయకత్వం వహించనున్నాయి. విపరీతమైన చలి, 15,000 అడుగుల కంటే ఎత్తులో అసాధారణ పరిస్థితుల్లో ఈ ఒంటెలు 250 కిలోల వరకు బరువును మోయగలవు. అదే సమయంలో తక్కువ నీరు, ఆహారంతో ఎక్కువ దూరం కూడా ప్రయాణించగలవు.


More Telugu News