Star Rating: జనవరి 1 నుంచి టీవీలు, ఫ్రిజ్‌లకు స్టార్ రేటింగ్ తప్పనిసరి

Star Rating Mandatory for TVs Fridges from January 1
  • వివిధ ఉపకరణాలపై స్టార్ లేబులింగ్‌ను తప్పనిసరి చేసిన కేంద్రం
  • గెజిట్ జారీ చేసిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ
  • డీప్ ఫ్రీజర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌పార్మర్‌లకు కూడా నిబంధన వర్తింపు
2026 జనవరి 1 నుంచి రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్లు, ఎల్పీజీ గ్యాస్ స్టవ్‌లు, కూలింగ్ టవర్లు, చిల్లర్స్‌తో సహా అనేక ఉపకరణాలపై కేంద్ర ప్రభుత్వం స్టార్ లేబులింగ్‌ను తప్పనిసరి చేసింది. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. బీఈఈ ప్రకారం, డీప్ ఫ్రీజర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లు, గ్రిడ్ కనెక్ట్ చేయబడిన సోలార్ ఇన్వర్టర్లకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది.

ప్రస్తుతం ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్లు, డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్లు, డీప్ ఫ్రీజర్లు, ఫ్లోర్ స్టాండింగ్ టవర్లు, సీలింగ్, కార్నర్ ఏసీలు, కలర్ టీవీలు, అల్ట్రా హై డెఫినిషన్ టెలివిజన్ వంటి వాటిపై స్టార్ లేబులింగ్ స్వచ్ఛందంగా ఉంది. అయితే, దీనిని నూతన సంవత్సరం నుంచి తప్పనిసరి చేస్తున్నారు.

స్టార్ లేబులింగ్ ఉపకరణాల జాబితాను ఎప్పటికప్పుడు నవీకరిస్తామని అధికారిక వర్గాలు వెల్లడించాయి. గతంలో ఎయిర్ కండిషన్లు, ఎలక్ట్రిక్ సీలింగ్ టైప్ ఫ్యాన్లు, స్టేషనరీ స్టోరేజ్ టైప్ ఎలక్ట్రిక్ వాటర్ హీటర్, వాషింగ్ మెషీన్, ట్యూబలర్ ఫ్లోరో సెంట్ ల్యాంప్స్, ఎల్ఈడీ ల్యాంప్స్‌కు ఈ నిబంధన తప్పనిసరిగా ఉంది. ఈ ఉపకరణాల కోసం ప్రజల అభిప్రాయాన్ని కూడా బీఈఈ స్వీకరించింది.
Star Rating
BEE
Bureau of Energy Efficiency
Refrigerators
Televisions
LPG Gas Stoves

More Telugu News