2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

  • తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్య సాధన దిశగా పయనిస్తున్నట్లు వెల్లడి
  • అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి
  • ప్రతి కుటుంబం ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్య సాధన దిశగా పయనిస్తున్నట్లు పేర్కొన్నారు.

అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కొత్త ఏడాది ప్రతి కుటుంబం ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 2026 సంవత్సరంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో తెలంగాణ వేగవంతమైన పురోగతిని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

2026 నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్ నగరం ముస్తాబైంది. నగరంలో వివిధ ప్రాంతాల్లో కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల వరకు వినోద కార్యక్రమాలు నిర్వహించి 2026 సంవత్సరం రాగానే పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న తరుణంలో రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


More Telugu News