ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
- ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ న్యూ ఇయర్ విషెస్
- వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఏపీ ప్రజలకు సేవ చేస్తున్నారని ప్రశంస
- ప్రభుత్వ పాలనకు అధికారులే వెన్నెముక అని కొనియాడిన పవన్
- పేదవాడి జీవితం మారేది అధికారుల చిత్తశుద్ధి వల్లేనని వ్యాఖ్య
- 2026లో మరింత వేగంగా పనిచేసి వికసిత్ ఆంధ్రాను నిర్మిద్దామని పిలుపు
2026 నూతన సంవత్సరం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ సహా అన్ని విభాగాల అధికారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాలనకు అధికారులే వెన్నెముక అని ఆయన అభివర్ణించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి తమ సొంత ఊళ్లను వదిలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేస్తున్న అధికారుల త్యాగాలను తాము లోతుగా గుర్తిస్తున్నామని, వారి సేవలకు కృతజ్ఞతలు అని పవన్ పేర్కొన్నారు.
అసెంబ్లీలో తాము విధానాలను, చట్టాలను రూపొందిస్తే.. వాటికి క్షేత్రస్థాయిలో ప్రాణం పోసేది అధికారులేనని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులుగా తాము దిశానిర్దేశం మాత్రమే చేస్తామని, కానీ సామాన్యుడి జీవితం నిజంగా మారాలంటే అది అధికారుల చిత్తశుద్ధి, పరిపాలన దక్షతపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీ పునర్నిర్మాణం అనేది ఒక సమిష్టి స్వప్నమని, దీనిని సాకారం చేయడంలో అధికారుల భుజస్కందాలపైనే పెద్ద బాధ్యత ఉందని గుర్తుచేశారు.
2026లో అధికార యంత్రాంగం మరింత వేగంగా, మానవీయ కోణంతో పనిచేయాలని పవన్ ఆకాంక్షించారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాధన కోసం నూతనోత్సాహంతో పనిచేద్దామని, వికసిత్ భారత్ నిర్మాణంలో ఏపీని ఆదర్శంగా నిలపాలని ఆయన అధికారులకు పిలుపునిచ్చారు.